# Tags
#తెలంగాణ

గునుకులపల్లిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు…

చిగురుమామిడి (ఎం. కనకయ్య) :

ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ కుమార్, లక్ష్మి కిరణ్ అన్నారు.

ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను మండలంలోని గునుకుల పల్లె గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. యూనిట్ తీసుకున్న గ్రామాన్ని గ్రామంలో సంతృప్తికరస్థాయిలో నాలుగు పథకాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులన్నిటిని క్రోడీకరించి అర్హులను గుర్తించి, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి లబ్ది చేకూరుస్తామన్నారు.

గ్రామంలో రైతు భరోసా 1899 మంది రైతులు, కొత్త రేషన్ కార్డులు 48, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా 5, ఇందిరమ్మ ఇల్లు 4 లబ్ధిదారులకు గ్రామంలో అర్హులకు మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసాలో భాగంగా అర్హులైన 1899 మంది రైతులకు గాను 2.15 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. మార్చి నాటికల్లా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తాసిల్దార్ రమేష్, ఎంపీడీవో, గ్రామ ప్రత్యేక అధికారి మధుసూదన్, ఏవో రాజుల నాయుడు, ఎఈ నిరంజన్ రెడ్డి, ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ అరుణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తోపాటు మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బద్దం నరసింహారెడ్డి, కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు పోలు స్వప్న, నాయకులు బాలయ్య,, మహేందర్, రాజు తదితరులు ఉన్నారు.