# Tags
#తెలంగాణ

ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి

మంథని :

సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి

రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కోర్టుల ప్రాంగణంలో కక్షిదారుల మరియు న్యాయవాదుల సౌకర్యార్ధం ఈ-సేవా కేంద్రాలను తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ-సేవా కేంద్రాన్ని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెవిఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షులు కే.రఘోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి యం.సహేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సువర్ణ చంద్రశేఖర్, న్యాయవాదులు శశి కాంత్ కాచె, బోట్ల ఆంజనేయులు, కూ సత్యనారాయణ, సదన్ కుమార్, శశి భూషణ్ కాచె, బండ మాదురి, వేద వ్యాస్, వివిధ కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.