# Tags
#తెలంగాణ

డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్..

జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకుల సూచనలు

జూమ్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు ..

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు పలు సూచనలు చేస్తూ, వాటిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీ లో క్రమశిక్షణతో పని చేసి ఉండాలనీ.. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని స్పష్టం చేశారు.

ఇప్పుడు పని చేసిన డీసీసీ అధ్యక్షులకు రెండో సారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదనీ, రాష్ట్ర నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న వారికి కూడా అవకాశం లేదన్నారు.

అలాగే, పార్టీ కి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు లేవనీ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

జిల్లాలోని సమావేశాలు అక్కడి నాయకుల ఇళ్లల్లో గాని వారి స్వంత కార్యాలయంలో సమావేశాలు పెట్టారాదంటూ…. పార్టీ కార్యాలయంలో కానీ లేదా అందరికి అందుబాటు లో ఉండే ప్రాంతంలో కానీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఓట్ చోరీ” కార్యక్రమంలో ….గ్రామంలో కనీసం వంద మందితో సంతకాలు చేయించి పంపించాలని జూమ్ మీటింగ్ లో విధి విధానాలు వెళ్ళడించారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజన్ కుమార్ తెలిపారు.