# Tags

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం

కొండగట్టు జేఎన్టీయూ కాలేజీని యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి
* నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తా..
* ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి
*జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం

ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కొండగట్టు జేఎన్టీయూ ను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని.. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. మినీ స్టేడియం,రామాలయం గ్రౌండ్, మునిసిపల్ పార్క్ లో మరియు SKNR మైదానంలో వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఓ హోటల్ లో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఓల్డ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతో పాటుగా పలువురు పట్టభద్రులను కలిసి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగ, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతానని .. పెద్దల సభలో చట్టాల రూపకల్పనలో ముందుంటానని అన్నారు… నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా కృషి చేస్తానని అన్నారు…. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డి ఏ ల మంజూరి విషయాన్ని, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఫీజు రీ ఎంబర్స్మెంట్ అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అలాగే, ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి చేస్తానని అన్నారు.