# Tags
#తెలంగాణ #జగిత్యాల

అల్ఫోర్స్ స్కూళ్లలో  ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, మరియు AMOT టాపర్స్ కు సన్మానం

జగిత్యాల అల్ఫోర్స్ శివవీధి, కృష్ణానగర్ స్కూళ్లలో   ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు, మరియు AMOT టాపర్స్ కు సన్మానం

సంక్రాంతి పండుగ ఆచారాల సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని మరియు పండుగ పల్లె శోభను పెంపొందిస్తుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.  

మల్యాల లోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో, జగిత్యాల కృష్ణానగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మరియు శివవీధిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో 

అట్టహాసంగా ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలకు మరియు అమాట్ (ALPHORES MATH OLYMPIAD TEST-2024)  టాపర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ గోదాదేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతి సంబరాలను  ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ… సంక్రాంతి పండుగ పల్లె శోభను తలపిస్తుందని మరియు ఈ పండగ ద్వారా సకల శుభాలు జరుగుతాయని వివరించారు. ఈ పండుగకు భారతదేశంలో చాలా విశిష్టత ఉన్నదని మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం ఈ పండుగను చాలా వేడుకగా కుటుంబ సభ్యుల ఆనంద ఉత్సవాల మధ్య గొప్పగా జరుపుకుంటారని అన్నారు..

ఈ పండుగను మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు చాలా గొప్పగా నిర్వహించుకుంటారని తెలిపారు. మొదటగా భోగి పండుగతో ప్రారంభమై, రెండో రోజు మకర సంక్రాంతి మరియు మూడవరోజు కనుమ పండుగతో కార్యక్రమాలను పరిపూర్ణంగా నిర్వహించుకుంటారని అన్నారు.

భోగభాగ్యాలు కలగడానికి భోగి పండుగను,  సకల శుభాలు పొందడానికి సంక్రాంతిని,  సౌభాగ్యం కలగడానికి కనుమ పండుగను చాలా ఆచార సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం గొప్ప ఆనందంగా భావిస్తారని నేటికి తరగని ఉత్సాహంతో ఈ గొప్ప సాంప్రదాయాన్ని పాటించడం మన భారత దేశ ఔన్నత్యానికి ఒక గొప్ప  ప్రతీక అన్నారు.

కాగా, కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించిన “సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సంక్రాంతి వచ్చిందే తుమ్మెద నృత్య ప్రదర్శన ఆకర్షింపచేసింది.

పాఠశాల ప్రాంగణాన్ని పల్లె వాతావరణం తలపించే విధంగా చక్కగా అలంకరించారు.కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో నిర్వహింపబడిన”అల్ఫోర్స్ మ్యాథ్ ఒలంపియాడ్ టెస్ట్ జగిత్యాల విభాగం టాపర్స్ కు” బహుమతులను ప్రధానం చేసి, అభినందనలు తెలిపారు.

శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి మరియు గణిత శాస్త్ర అభివృద్ధికి కృషిచేసి చరగని ముద్ర వేసుకున్నారని మరియు వారు చేసిన సేవలు చారిత్రాత్మకమైనవని  కొనియాడారు.ప్రతి విద్యార్థి రామానుజన్ వలె శ్రమపడి అద్భుతాలను సృష్టించాలని కోరారు.కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్్స, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అమాట్ టాపర్స్ మరియు  విద్యార్థులు పాల్గొన్నారు.