# Tags
#తెలంగాణ

అందుబాటులో అన్ని వైద్య సేవలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి, (Sampath P):

హెల్త్ సబ్ సెంటర్ భవనానికి భూమి పూజలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం


ప్రజలందరికీ అందుబాటులో అన్ని వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.

బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో  రూ. 20 లక్షలతో  హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నూతనంగా ఆసుపత్రులకు భవనాలు నిర్మిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైద్య దవాఖానల్లో అన్ని సేవలు కొనసాగుతున్నాయని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, డీఎంహెచ్ఓ వసంతరావు, పంచాయతీరాజ్ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.