# Tags
#తెలంగాణ

సాధారణ ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి… జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా .. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ .ఎస్. డాక్టర్ రజిత సాధారణ ప్రసవా లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని చీర్లవంచ మరియు విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మండల వైద్యాధికారులతో మరియు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినారు. మండల ఆరోగ్య ఉప ఆరోగ్య కేంద్రాలలో పని చేసే ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీల నమోదు కార్యక్రమంలో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి, ఐ రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయవలసిందిగా మరియు సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేటట్లు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని సూచించినారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు మరియు రక్తపోటు, మధుమేహం, క్యాన్సరు( రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, గర్భాశయ కాన్సర్లను) గుర్తించి, ఆరోగ్య సేవలు అందించి,వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయవలసిందిగా సూచించినారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, డాక్టర్ అనిత విలాసాగర్, చీర్లవంచ డాక్టర్ రామకృష్ణ,ఏఎన్ఎంలు, ఆశాలు, సిహెచ్ఓ సత్యనారాయణ, డిడిఎం కార్తీక్ గార్లు పాల్గొన్నారు.