# Tags
#జగిత్యాల

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు

వేడుకగా జగిత్యాల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ విద్యానగర్ మరియు అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు

విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని మరియు వారికి వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించి విజేతలుగా తీర్చిదిద్దాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌.నరేందర్ రెడ్డి గారు జగిత్యాల లోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ మరియు అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ వారు సంయుక్తంగా నిర్వహించిన “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


ప్రారంభానికి ముందు వారు చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను వేడుకగా ప్రారంభించి విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నామని మరియు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పాఠశాల విద్యా విధానాలను అమలుపరుస్తూ విజయం పరంపరను ఇతర విద్యాసంస్థలకు దీటుగా కొనసాగిస్తూ విద్యారంగానికి మార్గదర్శకంగా నిలుస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు వారి పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యంగా నేటి కాలంలో యువత బెట్టింగ్ యాప్ ల ద్వారా తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని ఇది చాలా విచారకరమని తెలుపుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేసి అగ్రగామిగా ఉండేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించి ఉత్తమంగా ఉండాలని సూచించారు.
వార్షిక ప్రణాళికలో భాగంగా పాఠశాల స్థాయిలో నిర్వహించినటువంటి వివిధ ప్రతిభా పాటవ పోటీలలో మరియు క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి రానున్న రోజుల్లో మరిన్ని అపూర్వ విజయాలను సొంతం చేసుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు‌
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
వేడుకగా నిర్వహించినటువంటి వార్షికోత్సవ సంబరాలు భాగంగా విద్యార్థుల ప్రదేశించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నాటికలు ఆలోచింప చేయడమే కాకుండా మంత్రముగ్ధులను చేసింది