# Tags
#తెలంగాణ

Alphores నరేందర్ రెడ్డి నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించిన ఆయన సతీమణి వనజారెడ్డి

కరీంనగర్ జిల్లా :

కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్ పట్టభద్రులఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో సిబ్బంది సంబరాలు..

కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో సంబరాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి వనజా రెడ్డి నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించారు. ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పార్టీ శ్రేణులతో పాటు అల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రతినిధులు నిమగ్నమయ్యారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొత్తం 3 లక్షల 41 వేల మంది పట్టభద్దుల ఓటర్లు ఉన్నారు.