# Tags

విద్యాబుద్ధులు నేర్పిన గురువును సన్మానించిన పూర్వ విద్యార్థులు

నూతన ఎంఈఓ కృష్ణహరి కి ఘన సన్మానం…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట (సంపత్ పంజా)

నూతన ఎంఈఓ గాలిపల్లి కృష్ణ హరి బాధ్యతలను స్వీకరించడంతో ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గాలిపల్లి కృష్ణ హరి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ విద్యార్థులు శనివారం విద్య వనరుల భవనంలో ఘనంగా సన్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు మండల ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని పాఠశాలలో చదువుకున్న రోజులను పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు, విద్యార్థి సంఘ నాయకులుగా పూర్వ విద్యార్థులుగా నూతన ఎంఈఓ గాలిపల్లి కృష్ణ హరి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసినట్లు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, బీఆర్ఎస్వి నాయకులు సింగారం దేవరాజు, కొర్రి అనిల్ కుమార్, మాజీ ఎంపిటిసి సింగారం మధు, సిరికొండ నాగరాజు, ములిగే ప్రమోద్ కుమార్, కొర్రి ఆశీర్వాదం, జుబేర్, పవన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.