35.19 కోట్ల రూ.టీటీడీ నిధులతో కొండగట్టు క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసిన ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సిరిసిల్ల శ్రీనివాస్ :
-కొండగట్టు గిరిప్రదక్షిణకు సహకరిస్తా, కరసేవ చేస్తా…పవన్ కళ్యాణ్
-అంజన్న అజ్ఞ , భక్తులు కోరుకున్న బలమైన సంకల్పంతోనే టీటీడీ ద్వారా ఇది సాధ్యమయ్యింది

కొండగట్టు అంజన్న నా ప్రాణదాత, స్వామి వారి అజ్ఞ , భక్తులు కోరుకున్న బలమైన సంకల్పంతోనే ఈరోజు కొండగట్టు క్షేత్రంలో టీటీడీ ద్వారా అభివృద్ధిపనులు చేపట్టడానికి సాధ్యమయ్యిందన్నారు.
బ్యూరోక్రాట్ లో మనసున్నా కూడా కొన్ని పనులు చేయడం ఒక్కో సారి కుదరదు, కానీ ఇంత పెద్ద ఎత్తున కొండగట్టు క్షేత్ర అభివృద్ధి చేస్తున్నామంటే అది స్వామి వారి అనుగ్రహం, తిరుమల తిరుపతిదేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బి ఆర్ నాయుడు, బోర్డు సభ్యులు అందించిన సహకారం అన్నారు.
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు శనివారం 35.19 కోట్ల రూ. టీటీడీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్ తో పాటు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మరియు అధికార యంత్రాంగం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో కొండగట్టు అంజన్నకు పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,

తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న సందర్భంలో, మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరినట్టుగా, కొండగట్టు గిరిప్రదక్షిణకు సహకరిస్తానంటూ, మా జనసేన కార్యకర్తలు నాయకులం వచ్చి కరసేవ చేస్తాం అని ప్రకటించారు.
కొండగట్టు అంజన్న స్వామి వారి అనుగ్రహం, ఆజ్ఞ, ఆశీస్సులుగా భావిస్తున్నానన్నారు.ఈఅభివృద్ధిపనులకు సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని మోడీ ఆశీస్సులు, టీటీడీ సహకారం తోనే కొండగట్టు అంజన్నకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు.
కొండగట్టు అంజన్న శక్తి ఒక్క తెలంగాణా ప్రాంత్తానికే కాదు, విశ్వానికే ఒక అద్భుతమైన శక్తి.. భారతదేశంకకే రక్ష అన్నారు. అయితే డబ్బులోక్కటే ప్రధానం కాదనీ, రామభక్తులు సమిష్టిగా కోరుకుంటే కానిదంటూ ఏదీలేదు.రామకార్యం ఏది తలపెట్టినా సాధ్యమవుతుంది.
సనాతనధర్మం ఆచరించే ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించాలన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





