# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఈ నెల 24న యాంటీ-నార్కోటిక్స్ జిల్లా ఎస్పీ, పోలీసు విభాగం – ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం 

జగిత్యాల :

  • యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో పోస్టర్ల ఆవిష్కరణ 

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ & C.E.O.., హైదరాబాద్ వారి లేఖ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

ఈ మేరకు యాంటీ-నార్కోటిక్స్ విభాగం,  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు విభాగం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల సహకారంతో ఈ నెల 24 న డిగ్రీ కళాశాలల విద్యార్ధినీ , విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని విరూపాక్షి ఫంక్షన్ హాల్ లో 24న ఉదయం 9-30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక అవగాహనా కార్యక్రమం మరియు ఇందుకు సంబంధించిన 7 అంశాలపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీలలో గెలుపొందిన టాప్ -3 లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా ఆశోక్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమం కో ఆర్డినేటర్, కళాశాల ncc లెఫ్టినెంట్ అధికారి పర్లపల్లి రాజు, లెక్చరర్ లు డా. సాయి మధుకర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా కె. సురేందర్, అంకం గోవర్ధన్ ,కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పోటీలకు సంబంధించిన 7 అంశాలు : 

i. వీధి నాటక పోటీ (Street Play) మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాలను హైలైట్ చేసే 5-7 నిమిషాల స్కిట్.

ii. పోస్టర్ & నినాదాల తయారీ (Poster & Slogan Making) మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలతో ప్రభావవంతమైన పోస్టర్ల రూపకల్పన.

iii. షార్ట్ ఫిల్మ్ (Short Film making) పోటీ – మాదకద్రవ్యాల అవగాహనను ప్రోత్సహించే 2-3 నిమిషాల షార్ట్ ఫిల్మ్ సమర్పణ.

iv. చర్చ (Debate)-అంశం: “శిక్ష vs. పునరావాసం – ఏది బాగా పనిచేస్తుంది?”

v.  రాప్ లేదా కవితా యుద్ధం ( Rap or Poetry Battle )మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలను అందించే స్పోకెన్ వర్డ్ ప్రదర్శనలు.

vi. క్విజ్ పోటీ (Quiz Competetion) మాదకద్రవ్యాల ప్రభావాలు, చట్టాలు మరియు నివారణపై జ్ఞానాన్ని పరీక్షించడం.

vii. సోషల్ మీడియా సవాళ్లు (On Social Media)- పాల్గొనేవారు మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదాలతో ఈవెంట్ చిత్రాలను పోస్ట్ చేయాలి, TGANB మరియు విద్యా అధికారులను ట్యాగ్ చేయాలి.

పై 7 అంశాలపై జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులు పేర్ల నమోదు, పూర్తి వివరాలకోసం కార్యక్రమం కో ఆర్డినేటర్, sknr కళాశాల ncc లెఫ్టినెంట్ అధికారి పర్లపల్లి రాజు , సెల్ no. +91 99637 70926 లో సంప్రదించగలరని తెలిపారు.