# Tags
#తెలంగాణ

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ మృతుడి కుమార్తెల దరఖాస్తు 

హైదరాబాద్ :

గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా తమకు చెల్లించాలని గల్ఫ్ మృతుడు తౌటు రామచంద్రం కుమార్తెలు ప్రవళిక, అక్షితలు శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో దరఖాస్తు చేశారు. జగిత్యాల పట్టణం క్రిష్ణానగర్ కు చెందిన రామచంద్రం జనవరిలో దుబాయిలో మృతి చెందారు.
ఈ సందర్భంలో….ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ లు చొరవ తీసుకొని తమకు రూ.5 లక్షల మృతధన సహాయం ఇప్పించాలని ప్రవళిక, అక్షితలు విజ్ఞప్తి చేశారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి లు దరఖాస్తు రాయడంలో వారికి సహకరించారు.