# Tags

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవం

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు అందరు వారిని ఘనంగా సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి క్రీడారంగానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు.
ప్రతిష్టాత్మక క్రీడా సంస్థకు చైర్మన్ గా ఎన్నిక చేసినందుకు క్రీడాకారులు అందరికీ నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపి, క్రీడా రంగానికి చేయూతనిచ్చి క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.