# Tags

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్

కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ ఫౌండేషన్ ద్వారా ఒక షెడ్డు నిర్మించి ఇస్తామని ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని తన సొంత ఖర్చుతో తన తల్లి పేరుతో ఉన్న ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా షెడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి వందల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని , కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి భక్తుల కష్టాలు తీర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు . ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆసంపల్లి శ్రీనివాస్ తెలిపారు .

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్