బీసీ బంద్ కు మద్దతుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ
చిగురుమామిడి (కనకయ్య ముడికే): చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 150 మోటర్ సైకిల్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు […]



