# Tags

దసరా శరన్నవరాత్రోత్సవాల కరపత్రం అవిష్కరణ

జగిత్యాల జిల్లా… కనక దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో జరిగే 22- 09 – 2025 నుండి 2 -10 -2025 వరకు జరిగే నవమ వర్ష దసరా శరన్నవరాత్రోత్సవాల వైదిక కార్యక్రమ వివరాల కరపత్రం శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య ఆవిష్కరించారు. 22 – 09 – 2025 రోజున అశేష జన వాహిని మధ్య అమ్మవారి ఊరేగింపు బైపాస్ రోడ్ నుండి మొదలై టవర్ మీదుగా అమ్మవారి మండపం కు చేరుకుంటుంది. […]

చంద్రగ్రహణం వీడియో….

ఆకాశంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే పరికరాలు అవసరం లేకుండానే చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణం మొదలవ్వడం, చంద్రుడు చిక్కుకుపోయినట్లుగా అవ్వడం, బ్లడ్ మూన్గా మారడం, గ్రహణం వీడాక ప్రకాశవంతంగా వెలుగొందిన దృశ్యాలు అందరినీ అబ్బుర పరిచాయి. ప్రస్తుతం Social Media లో అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. మరి మీరూ గ్రహణం టైమ్ ల్యాప్స్ వీడియో చూసేయండి. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

సైనికుల్లా పని చేశారు శభాష్..కరెంటోళ్ళు కంటి రెప్పవాల్చలే:విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం

సేవలు భేష్ అనిపించుకోవడం అభినందనీయం : జగిత్యాలవిద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం కోరుట్ల : కరెంటోళ్ళు కంటి రెప్పవాల్చలే సేవలు భేష్.. సమన్వయంతో సైనికుల్లా పని చేశారు శభాష్..అని అందరినోటా అనిపించుకొనేలా అంకితభావంతో పని చేయడం అభినందనీయం జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం అన్నారు. వినాయక నవరాత్రోత్సవాలు ఆరంభం నుండి నిమజ్జనోత్సవం నిర్వహించే వరకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఎక్కడికక్కడ సిబ్బంది విగ్రహాలు తరలింపులో జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైన మరమ్మత్తులు గుర్తించి సకాలంలో పూర్తి చేసి […]

క్షయ వ్యాధి పట్ల అవగాహన సదస్సు…

(తెలంగాణ రిపోర్టర్):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్లారెడ్డిపేట లో క్షయ వ్యాధి అవగాహన పై టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం,ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డా. సారియా అంజూమ్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ ఎల్లారెడ్డిపేట ఉప ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టి.బి సూపర్వైసర్ మహిపాల్ మాట్లాడుతూ ఇందులో షుగర్, క్యాన్సర్, […]

వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలి : జిల్లా వైద్యాధికారి రజిత

( తెలంగాణ రిపోర్టర్):- జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీర్లవంచ లోని బస్వాపూర్ మరియు ఇల్లంతకుంట మండలములోని పెద్దలింగాపూర్ గ్రామాలని జ్వరాల నియంత్రణలో భాగముగా తనిఖి నిర్వహించి రికార్డులను పరిశీలించి ఆరోగ్య కార్యక్రమాలపై మరియు కాలానుగుణ వ్యాదుల పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం, అనుమానిత జ్వర పిడితులను గుర్తించి వారి నుండి రక్త నమూనాలను సేకరించి […]

అసంపూర్తి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై సిద్దం చేయాలి : ( తెలంగాణ రిపోర్టర్ : సంపత్ పంజా): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న […]

జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ:   సిమెంట్‌పై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు,  చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ,  33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌,జ్యూస్‌లపై 40శాతం GST,  పాన్‌, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% GST, బొగ్గుపై జీఎస్టీ 5 నుంచి 18 శాతానికి పెంపు,  చేనేత వస్తువులపై 5 శాతం జీఎస్టీ, కళ్లద్దాలపై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గింపు,  పునరుత్పాదక ఇంధన వస్తువులపై పన్ను […]

సెయింట్ జార్జ్ డిగ్రీ & పిజి కళాశాలలో ‘ఒనిక్స్ మాస్ కామ్ స్టూడియో’ ను ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్ 

హైదరాబాద్ : ప్రశాంత్ శర్మ సి.హెచ్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ డిగ్రీ & పిజి మహిళా కళాశాల జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ‘ఒనిక్స్ మాస్ కామ్ స్టూడియో’ని ప్రారంభించింది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల రోజున జర్నలిజం విద్య నాణ్యతను పెంపొందించడానికి రూపొందించబడిన అత్యాధునిక స్టూడియో సౌకర్యం ఇది. ఫ్రీలాన్స్ ట్రైనర్ నాగరాజు మరియు భారతదేశంలో మొట్టమొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరై, […]

బిఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడింది :బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నరసయ్య

( తెలంగాణ రిపోర్టర్) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి బయటపడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ల అవినీతిని జస్టిస్ గోష్ కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇప్పటికైనా నిజా నిజాలు ఒప్పుకొని […]

మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట మండలం: పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్కూల్ లో 25 మంది విద్యార్థులు ఉండగా, మరో విద్యా వాలంటీర్ ను నియమిచాలని ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా గోంగూర పచ్చడి మాత్రమే పెట్టడం కలెక్టర్ గమనించారు. గ్రామంలో పలు […]