# Tags

ప్రమాదకర విద్యుత్ నెట్వర్క్ సరిదిద్దడానికి సామూహిక ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం

జగిత్యాల జిల్లా : రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న స్థలాలను కనుగొని వాటిని సరిదిద్ధి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి ఇంజనీర్లు మరియు సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు. […]

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరంమెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ

కోరుట్ల, ఆగస్టు 7: తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరం లాంటివి అని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగ పర్వదిన వేడుకలు నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ మాట్లాడుతూ….తల్లిపాల యొక్క ప్రాముఖ్యత చాటిచెబుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు చురుగ్గా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమాజంలో ప్రేమానురాగాలతో ఎదుగుతారని, జ్ఞాపకశక్తి […]

రాయికల్ పట్టణంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ, భారత దేశ సంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని […]

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి

ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి అశ్విని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలుడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది పరామర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో మాట్లాడి గాయపడిన విద్యార్ధికి వైద్య ఖర్చుల కింద ఆర్ధిక సహాయం అందించాలని కేకే జిల్లా కలెక్టర్ ను కోరారు. కేకే వెంట పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మా రెడ్ది, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడీ రాం రెడ్ది, […]

చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు

న్యూఢిల్లీ ( తెలంగాణ రిపోర్టర్) చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ బీసీల పక్షాన పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రి పొన్నం […]

హరిత ఇంధన ఉత్పత్తి పర్యావరణ హితం : జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం

మెటుపల్లి: మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు. మెటుపల్లి లో సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడుతూ, ప్రస్తుత విద్యుత్ అవసరాలకు దేశంలో థర్మల్ స్టేషన్ ల ద్వారా సింహభాగం ఉత్పత్తి జరుగుతోందని, బొగ్గు మండించడం వల్ల వాతావరణ […]

రాయికల్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం

జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా: ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రాయికల్ :(సింగని శ్యాంసుందర్, తెలంగాణ రిపోర్టర్) జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, “జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల […]

మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలి

జగిత్యాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ…సస్పెన్షన్ కు గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్న కు మరో గ్రామ పంచాయతీ అయిన […]

స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా పద్మశాలి సంఘ ఎన్నికలు, అధ్యక్షులుగా గెలుపొందిన భోగ రాజేశం 

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఆదివారం రాయికల్ లోని ఆ సంఘం కళ్యాణ మండపంలో జరిగాయి. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.గత పది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రచారం చేస్తూ ఎన్నికల రోజైన ఆదివారం వృద్ధులు, […]

అట్టహాసంగా సాగుతున్న రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు

రాయికల్ :ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి, ఆదివారం నాటి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొంటుందగా, ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుండి ప్రారంభమైన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పోటీ పడుతున్నారు. కాగా అధ్యక్షుడి పదవికి గాజంగి ఆశోక్ నేత, బోగా రాజేశం నేత లు పోటీ పడుతున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]