# Tags

భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు: జిల్లా కలెక్టర్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) : రాజన్న సిరిసిల్ల జిల్లా.. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు మరియు మత్స్య కారులు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలను కోరారు. రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా లోని మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని తెలియజేశారు.మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నర్మాల ఎగువ మానేరు డ్యామ్, […]

అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకుకు వెళుతున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of […]

పుట్టిన రోజున యూరియా బస్తాను కానుకగా ఇచ్చిన స్నేహితులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేములవాడ వేములవాడ మండలంలోని శాత్రాజుపల్లి గ్రామంలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో ఒక యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar […]

నిబంధనల ప్రకారం కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ :: జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ నిబంధనలో ప్రకారం జాతీయ పతాకావిష్కరణ చేశారని ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. షూ వేసుకుని జాతీయ జెండా ఆవిష్కరించడం వల్ల జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ అవమానిస్తున్నట్లు ఆరోపిస్తూ, కలెక్టర్ పట్ల అమర్యాదగా అసభ్య పదజాలంతో  తంగళ్ళపల్లి వార్తలు, ముచ్చర్ల […]

సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాధికారి కే. రాము ప్రారంభించారు. ఈ సందర్బంగా డి ఈ ఓ రాము మాట్లాడుతూ…ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. […]

ఆవాసం అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం :రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్ రావు 

 జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసం (జగిత్యాల) అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం అందజేసింది. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి ఆవాసం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి యోగ్యులుగా ఎదగాలని, సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్రావు అన్నారు. గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో వాల్మీకి ఆవాసం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో రాంగోపాల్ రావు తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ […]

న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం : కాచే

మంథని : న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ కి అప్పగింస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. సిబిఐ విచారణలో వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని,కుట్ర దారులను బయటకు తీసి న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగి,బాదిత కుటుంబాలకు న్యాయం జరుగుతందని ఆశిస్తునాం.– -శశిభూషణ్ కాచె,న్యాయవాది,మంథని Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal […]

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి —రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన […]

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి : మున్సిపల్ మేనేజర్ వెంకట్ 

రాయికల్ : ఎస్ శ్యామ్ సుందర్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ మేనేజర్ వెంకట్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన భారతం దేవమ్మ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ […]

రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాల ఫోర్‌కాస్ట్‌తో వాహనదారులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ జాగ్రత్తలు, సూచనలు

సిద్దిపేట : వాతావరణ సూచనల ప్రకారం, సిద్దిపేట ప్రాంతంలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13, 14, 15) అతి భారీ నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాల వల్ల రోడ్లపై జారుడు పరిస్థితులు, నీటి నిల్వ, రోడ్డు దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి,వాహనదారులు సురక్షితంగా ప్రయాణించడానికి ఈ క్రింది సూచనలను పాటించమని సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ కోరుతున్నారు. ముఖ్యమైన సూచనలు: వర్షకాలంలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించండి. […]