మంగళవారం శాసన మండలిలో “ఫ్యూచర్ సిటీ”పై మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ గుర్తుకు వస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శంషాబాద్ విమానాశ్రయం మరియు ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా “ఫ్యూచర్ సిటీ” పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ […]



