# Tags

సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు : జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

తెలంగాణ రిపోర్టర్: యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు. మోతాదుకు మించి యూరియా వాడవద్దు : యూరియా నిల్వల పై జిల్లా వ్యవసాయ అధికారి రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12: సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం ముస్తాబాద్ లో కొంతమంది రాజకీయాల కోసం రైతు లని రెచ్చగొడుతూ ధర్నాలు చేపిస్తున్నారని, జిల్లాలో ఎక్కడ కూడా యూరియా […]

పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట, sampath panja రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లోని మణికంఠ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….ఎల్లారెడ్దిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ వెల్లడించారు.వీటి ద్వారా పేదలకు […]

నియోజకవర్గ అభివృద్ధికోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తా : MLA డా. సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా రాయికల్ : ఎస్. శ్యామసుందర్ నియోజకవర్గ అభివృద్ధికోసంముఖ్యమంత్రితో కలసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాయికల్ మండలం సింగారావు పెట్ , కిష్టంపేట గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే సింగారావు పెట్ లో మారంపల్లి మహేష్ కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి, కిష్టం పెట్ […]

ప్రమాదకర విద్యుత్ నెట్వర్క్ సరిదిద్దడానికి సామూహిక ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం

జగిత్యాల జిల్లా : రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న స్థలాలను కనుగొని వాటిని సరిదిద్ధి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి ఇంజనీర్లు మరియు సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు. […]

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరంమెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ

కోరుట్ల, ఆగస్టు 7: తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరం లాంటివి అని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగ పర్వదిన వేడుకలు నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ మాట్లాడుతూ….తల్లిపాల యొక్క ప్రాముఖ్యత చాటిచెబుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు చురుగ్గా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమాజంలో ప్రేమానురాగాలతో ఎదుగుతారని, జ్ఞాపకశక్తి […]

రాయికల్ పట్టణంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ, భారత దేశ సంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని […]

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి

ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి అశ్విని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలుడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది పరామర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో మాట్లాడి గాయపడిన విద్యార్ధికి వైద్య ఖర్చుల కింద ఆర్ధిక సహాయం అందించాలని కేకే జిల్లా కలెక్టర్ ను కోరారు. కేకే వెంట పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మా రెడ్ది, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడీ రాం రెడ్ది, […]

చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు

న్యూఢిల్లీ ( తెలంగాణ రిపోర్టర్) చలో బీసీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ బీసీల పక్షాన పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రి పొన్నం […]

హరిత ఇంధన ఉత్పత్తి పర్యావరణ హితం : జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం

మెటుపల్లి: మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు. మెటుపల్లి లో సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడుతూ, ప్రస్తుత విద్యుత్ అవసరాలకు దేశంలో థర్మల్ స్టేషన్ ల ద్వారా సింహభాగం ఉత్పత్తి జరుగుతోందని, బొగ్గు మండించడం వల్ల వాతావరణ […]

రాయికల్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం

జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా: ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రాయికల్ :(సింగని శ్యాంసుందర్, తెలంగాణ రిపోర్టర్) జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, “జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల […]