# Tags

ఎల్లో జర్నలిజం చేయవద్దు.పత్రిక స్వేచ్ఛను కలిగి ఉండండి… క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ మాట్లాడుతూ …పాత్రికేయ మిత్రులు ఎల్లో జర్నలిజం చేయవద్దని, సమస్యల పట్ల అందరము కలిసి ఏ సభ్యుడికి కష్టం వచ్చినా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులకు స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు.వార్తల పట్ల నిష్పక్షపాతంగా నిర్భయంగా రాస్తామని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి […]

CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల: గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్  గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపిర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమంనిర్వహించారు. శనివారం మధ్యాహ్నం […]

నూతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్ అధ్యక్షతన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మాటి నరసయ్య, సద్ది లక్ష్మారెడ్డి,రాంరెడ్డి, జిల్లా నాయకులు గౌస్, శ్రీనివాస్ ళు హాజరై ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య […]

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. అమీర్ పేట్ ‌లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలలో ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్ రాజిరెడ్డి, శ్యామ్మోహన్ రావు, […]

విద్యార్థుల్లో “అల్ఫోర్స్ జోష్”-అలరించిన సాంస్కృతిక వేడుకలు

జగిత్యాల: విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విద్య చాలా అవసరమని, తద్వారా వారికి సమాజంలో సంపూర్ణ అవగాహన వస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. “జోష్” పేరుతో నిర్వహింపబడిన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక స్పృహతో పాటు పలు కళల పట్ల […]

ఇంటికి కావలసిన అసలు వారిపై వివక్ష ఎందుకు ?!బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనముల నుండికొడుకు పెట్టే పిండాలకన్నా…. కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది __ అదీ….కోడలి గొప్పతనం….! *కూతురా కోడలా ఎవరు ప్రధానం…???అనే ప్రశ్నకు ‘కోడలే’ అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం __ *ఎందుకోతెలుసా…!!! చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ ‘త్యాగశీలి’ కోడలు…!! కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే ‘గుణశీలి’ కోడలు..!! […]

ఇది మన యువతకు ప్రేరణనిచ్చే వార్త-మన ఘన చరిత్రలో ఒక కలికి తురాయి!

కానీ మనలో ఎవరికీ ఆమె గురించి సరిగ్గా తెలియదు.దయచేసి చదవండి: మద్రాసు, 1930లు.ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది.18వ ఏట తల్లి అయింది.మరియు, బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే ఆమె భర్త మరణించారు. శబ్దం లేదు.సమాధానం లేదు.కేవలం నిశ్శబ్దం.కళ్ళముందున్న బిడ్డతో ఆమె జీవితం నిలిచిపోయినట్టే అనిపించింది. కాని అక్కడే ఆమె కథ ముగియలేదు. అక్కడినుంచే మొదలైంది. ఆమె పేరు అయ్యలసోమాయజుల లలితా.ఆమె తర్వాత ఏం చేసింది అంటే –భారతదేశం ఆనాటికి సిద్ధంగా లేదు. ఆమె తండ్రి […]

మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడికి 10 సం. జైలు శిక్ష, 11 వేల రూ. జరిమానా విధించిన న్యాయమూర్తి నారాయణ

జగిత్యాల : -కీలక తీర్పును వెలువరించిన 1st Addl. District & Sessions Judge శ్రీ నారాయణ -మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్న ఎస్పి అశోక్ కుమార్ వివరాలోనికి వెళ్తే… నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ తేదీ 13-06- 2022 రోజున సాయంత్రం అతని స్నేహితులైన పల్లికొండ రోహిత్, ప్రవీణ్ తో కలిసి పని నిమిత్తం ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి AP 01AH 4346 అనే బైక్ పై […]

అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయి :ఎస్ ఐ బోయిని సౌజన్య

మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణాను నిలువ చేస్తూ తోటపల్లి గ్రామ శివారులో డంపుల గా ఉన్న ఇసుకను బెజ్జంకి ఎస్ ఐ బోయిని సౌజన్య సోమవరం రోజున స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ ఇసుక ర వాణా ఎవరు చేసినా, ఉపేక్షించకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు . ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ నూతన గృహాలకు ప్రభుత్వ ఆదేశానుసారము, వారికి ఇసుకను రెవెన్యూ అధికారుల ద్వారా లబ్ధిదారులకు అనుమతులు […]

వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన మహిళా ఎస్ ఐ

బెజ్జంకి : శాంతి భద్రతలే కాదు, వ్యవసాయ రంగంలో సైతం మహిళలు ముందుంటారని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సౌజన్య చెపుతూ, ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో దిగి, మహిళలలతో కలిసి తానూ నాట్లు వేసింది. వివరాల్లోకి వెళితే, బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో వ్యవసాయ కూలీలతో కలిసి ఎస్ ఐ బోయిని సౌజన్య వరి నాటు వేశారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ.. ఇటీవల చైన్ స్నాచింగ్ దొంగతనాలు పెరుగుతున్నాయని, మహిళా కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూలీ పనులకు […]