# Tags

కోరుట్ల కాంగ్రెస్ ఖాతాలో మూడో సర్పంచ్

కోరుట్ల నియోజకవర్గం. మెట్ పల్లి మండలం. చింతలపేట గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తోట్ల చిన్నయ్య, ఉప సర్పంచ్ గా బోత్కూరి లింగారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.. ఈ సందర్బంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు ను ఏకగ్రీవ సర్పంచ్ తోట్ల చిన్నయ్య. ఉప సర్పంచ్ బోత్కూరి లింగారెడ్డి లు మర్యాదపూర్వకంగాకలిశారు. ఈ సందర్భంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపి […]

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ (రెడ్కో) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి లో పీఎం-సూర్యఘర్, పీఎం-కుసుమ్, ఈవీ- ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, తదితర ప్రభుత్వ పథకాల అమలు, సోలార్ […]

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ముగింపు – జగిత్యాల జిల్లాలో 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చివరి రోజు డిసెంబర్ 2 తో ముగియనున్న నేపథ్యంలో రాయికల్ మండలం వడ్డె లింగపూర్, కొత్తపేట మరియు అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ […]

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి:అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

జగిత్యాల. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అలసత్వం వహించకూడదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత నిర్వాహకులకు సూచించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ మరియు ధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత […]

తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) […]

రాయికల్ యువకుడికి వైద్య విభాగం లో మాస్టర్ డిగ్రీ :ఎండీ ఫిజీషియన్ గా పి. లోకేష్ చంద్ర

రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ, ఆర్ఎంపీ వైద్యులు,మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పిప్పోజీ మహేందర్ బాబు తనయుడు పిప్పోజి లోకేష్ చంద్ర …వైద్య విభాగం లో మాస్టర్ డిగ్రీ పట్టా సాధించాడు. డా.లోకేష్ చంద్ర రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు,హైదరాబాదులోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్య,అలాగే మెడిసిటీ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసి,అదే కళాశాల నుండి మాస్టర్ డిగ్రీ ఎండి ఫిజీషియన్ గా పట్టా సాధించాడు. […]

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు:ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, (సంపత్ పంజా): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఫేజ్ – 1 నామినేషన్ల దాఖలుకు నేడు శనివారం సాయంత్రం 05.00 గంటల వరకు గడువు ఉందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో రుద్రంగి మండలంలో 10 సర్పంచ్, 86 వార్డు సభ్యులు, వేములవాడ అర్బన్ మండలంలో 11 సర్పంచ్, 104 వార్డు సభ్యులు, వేములవాడ రూరల్ మండలంలో 17 సర్పంచ్, […]

చెక్ డ్యామ్ ల నిర్మాణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి :టిపిసిసి ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే

అసత్యపు ఆరోపణలకు పెట్టింది పేరు బిఆర్ఎస్ – గతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వాస్తవం కాదా  మంథని:  అసత్యపు ఆరోపణలకు మారుపేరు బీఆర్ఎస్ నాయకులని   టిపిసిసి ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే మండిపడ్డారు. గురువారం మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పై నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి […]

తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,  తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ భారతదేశంలో మొట్టమొదటి LEAP ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్ (MRO) కేంద్రమైన సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సౌకర్యాన్ని బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ₹1,300 కోట్ల పెట్టుబడితో, 44,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ కొత్త సౌకర్యానికి 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్లు ఉపాధి పొందుతారు. ఇది ప్రతి సంవత్సరం 300 […]

జగిత్యాల జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు :జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్

జగిత్యాల. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నోడల్ ఆఫీసర్ లు ,ఆర్డీవోలు మరియు ఎంపిడివో లతో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు […]