# Tags

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల – 12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు

హైదరాబాద్ :   తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల 👉  12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు.  👉  రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు.   👉 గతంలో హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో ఉంటాయి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని  👉 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర […]

కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా గాజంగి నందయ్య నియామకం

జగిత్యాల జిల్లా: జగిత్యాల మం. పొలాస గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బిసి వర్గానికి చెందిన గాజంగి నందయ్య నియామకమయ్యారు. జగిత్యాల జిల్లా నూతన డిసిసి అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన గాజంగి నందయ్యను ఇందిరా భవన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు సన్మానించి సత్కరించారు. నందయ్య నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి టీ. విజయలక్ష్మిదేవేందర్ […]

టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను సచివాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి- సాట్ ను అభినందించారు. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష డీఎస్సీకి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ ద్వారా సంసిద్ధులు కావాలని […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంలో తెలియజేసిన ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కోసం ఎంతో విలువైనదని శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్యం, కళ, సంస్కృతి, సమాజ సేవ అనే ఈ పథంలో సాహితీ స్నేహితుల ఆదరణే నా బలమూ, ప్రేరణ కూడా […]

వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం..

జగిత్యాల :రాయికల్ మండలం : ఎస్.శ్యామ్ సుందర్ : జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే ఆ నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయో వారికి వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ […]

జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం…

జగిత్యాల కలెక్టరేట్లో దిశ సమావేశం: మంగళవారం జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. దిశ కమిటీ చైర్మన్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిధిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూఐడిఎఫ్, ధాన్యం కొనుగోల్లు, […]

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అభినందనీయం :లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్

రాయికల్ : (S.శ్యామసుందర్) : నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ సహకారం అభినందనీయం లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్ బాబు అన్నారు. సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నీటి వినియోగ సౌకర్యార్థం 1000 లీటర్ వాటర్ ట్యాంక్,పదవతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్,డిసి మ్యాకల రమేష్,ఆడెపు రాంప్రసాద్ ల సహకారంతో మూడు బ్యాగుల అటుకుల […]

అనవసరమైన రాద్ధాంతం అది :మంచాల కృష్ణ, గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఊటూరి రమేష్, దారం గోపి

జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న 138 సర్వేనెంబర్ లోని 20 గుంటల స్థలానికి సంబంధించి “కిబాల (Qibala)” విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసిన అంశంపై పట్టణంలోని వివిధ వర్గాల వారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం చేస్తూన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నాము. గత 74 సంవత్సరాల క్రితం మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసిన ఈ సర్వే నెంబర్ లోని 20 గుంటల భూమి అంశాన్ని […]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు […]

నాయకుడికి పదవి, హోదా కాదు.. బాధ్యత ప్రధానం :టిపిడిఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పీ. బీసిరెడ్డి

యాదాద్రి : (టిపిడిఈఏ భవన్ లో ): తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిస్కంలను ఆర్థికంగా నష్టాల పేరిట బెయిల్ ఔట్ ప్యాకేజీ లు ఇచ్చి ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నదని, ఈ సంస్థలను బతికించుకోవాలంటే ప్రైవేట్ కు ధీటుగా ఉద్యోగులు మరింత కస్టపడి పనిచేయాలని, పునరుజ్జీవం కల్పించాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు పి.బీసిరెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి టిపిడిఈఏ భవన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాబోయే […]