స్టైపెండ్ సొమ్ము కోసం చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ హౌస్ సర్జన్ విద్యార్థుల నిరసన
కరీంనగర్: చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ యాజమాన్యం మెడికో ఇంటర్న్‌లకు (హౌస్ సర్జన్ విద్యార్థులకు) గత రెండు నెలలుగా స్టైపెండ్ సొమ్ము చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం11 గంటలనుండి అకస్మాతుగా కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఇంటర్న్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని OPDలు, వార్డువర్క్ మరియు వివిధ వైద్య సేవలను నిలిపి వేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంటర్న్‌లమైన తాము, […]