# Tags
#politics #Tech #తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటు వేయడం ఎలా అంటే!

తమ విలువైన ఓటును చెల్లని ఓటుగా వేసే అవకాశం ఇవ్వకుండా, సరైన పద్ధతుల్లో ఓటు వేయడం ఎలాగో తెలుసుకుందాం….

  • అభ్యర్థులు నచ్చకపోతే “నోటా” ఓటును కూడా మనం ఉపయోగించుకోవచ్చు.

ఓటు వేయడానికిలా…

  • మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫోటోలు ఉంటాయి.
  • మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1 వ నంబర్ వేయాలి.
  • ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు

* పోలింగ్ కేంద్రాల్లో సొంత పెన్ వాడకూడదు.వారు ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.

* వెళ్ళేటపుడు ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఎన్నికల కమిషన్ నిర్ణయించే ఐడి ప్రూఫ్స్ మాత్రమే.

* బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.

* బూత్ బయట ఓటర్ లిస్టులో పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.

  • ఓటు ఎలా వేయకూడదు? మీ సొంత పెన్ వాడకూడదు

👉 అభ్యర్థులందరికీ ఒకే నంబర్ ఇవ్వకూడదు

👉 ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీష్ లో కూడా వన్ అని రాయకూడదు. అంకె మాత్రమే వేయాలి. ఉదాహరణకు 1

👉 బ్యాలెట్ పేపర్లో ఎక్కువ పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.

👉 బ్యాలేట్ పేపర్ వారు చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే invalid గా తీసుకుంటారు.

👉 ఖాళీగా పేపర్ వేయరాదు.నచ్చకుంటే నోటా వేయొచ్చు.

👉 మీరు ఇచ్చే నంబర్ (అంకె)గట్టిగా పెన్ తో రుద్దకూడదు.

👉 అభ్యర్ధి పేరు మరియు బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా ఓటు చెల్లదు.

👉 బ్యాలెట్ పేపర్ నందు 1 ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగతా అంకెలు వేస్తే ఓటు వృధా అవుతుంది. ఓటు చెల్లదు.

ఈ విషయాలు గమనించి, మీ విలువైన ఓటును సరైన పద్దతిలో, సరైన రీతిలో, మీకు నచ్చిన అభ్యర్ధికి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయండి.

సిరిసిల్ల శ్రీనివాస్, SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) జిల్లా కమిటీ సభ్యుడు.