# Tags
#తెలంగాణ #జగిత్యాల

వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం..

జగిత్యాల :రాయికల్ మండలం : ఎస్.శ్యామ్ సుందర్ :

జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే ఆ నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయో వారికి వివరించారు.

ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి , చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్100, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181, జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ 112, అత్యవసర వైద్య హెల్ప్ లైన్ నెంబర్108, ఆపదలో ఉన్న అమ్మాయి హెల్ప్ లైన్ నెంబర్ 8712670783,సైబర్ నేరాలు హెల్ప్ లైన్ నెంబర్ 1930 దివ్యాంగుల హెల్ప్ లైన్ నెంబర్ 155326, వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567 లా గురించి అవగాహన కల్పించారు., బాల్య వివాహాలు జరగకుండా ఉండేందుకు ప్రతిజ్ఞ కూడా చేయించారు.

ఈ కార్యక్రమంలో, తల్లులు కిశోర బాలికలు కారోబర్ సంపూర్ణ, అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎం దేవలక్ష్మి, వివో ఏ లహరి, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేశారు.