# Tags
#తెలంగాణ

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 69వ జన్మదిన వేడుకలు

బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 69వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గీత భవన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్ హాజరై పార్టీ నాయకులూ కార్యకర్తలకు స్వీట్లతో వేడుకలు చేసుకున్నారు…

అనంతరం రాష్ట్ర నాయకులూ ,జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కమిటీ తరుపున మాయావతి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విదంగా రాజ్యాంగాన్ని రక్షించడం మరియు దానిని అమలు చేయడం కోసంతన జీవితం సమస్తాన్ని ధారబోసిన బహుజన యోధుడు మాన్యవర్ కాన్షిరాం మార్గంలో , ఆయనలాగే తన సమస్తాన్ని బహుజన సమాజం కోసం ధారబోసి బహుజన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న BSP జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ కుమారి మాయావతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరికంటే ముందుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బిఎస్పీ ఎంపీ లతో మద్దతు ప్రకటించిన గొప్ప నాయకురాలు అన్నారు.ఈ దేశానికి భావి భారత ప్రధాని అవుతారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్,జిల్లా ఇంచార్జిలు అక్కి బాలకిషన్ ,కళ్లేపల్లి రాజేందర్ ,మంద బాలయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రశాంత్ గౌడ్ ,జిల్లా కోశాధికారి ఉళ్లేందుల మహేష్ ,జిల్లా కార్యదర్శి మాతంగి మల్లయ్య,జిల్లా ఈసీ మెంబెర్ ఏదునూరి రమేష్ ,అసెంబ్లీ ఇంచార్జిలు నిషాని రాజమల్లు,మారేపల్లి మొగిలయ్య ,అసెంబ్లీ అధ్యక్షులు అస్తపురం మధు ,కాంపెల్లి రాజు ,మాతంగి తిరుపతి ,మహిళల నాయకురాలు ఆరెపల్లి సుధా ,అసెంబ్లీ కమిటీ ,మండల అధ్యక్షులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….