# Tags

“ఆయు” AAYU కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం

సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఎక్కడెక్కడి వారో ఒక్కటిగా చేరి, అందరం ఒక్కటిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం ఒక మంచి సాంప్రదాయంకు నాంది పలికినట్లయ్యిందని గేటెడ్ కమ్యూనిటీ మహిళలు అంటూ, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.q