# Tags
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్

భరత్ చంద్ర చారీ…నేనూ, మీ జిల్లా కలెక్టర్ ను అంటూ…

యాదాద్రి భువనగిరి జిల్లా

సంస్థాన్ నారయణపురం, కంకణలగూడెం గ్రామంలో 10 వ తరగతి విద్యార్థులను చదువు వైపు ప్రోత్సాహించాలన్న లక్ష్యంతో బుధవారం ఉదయం 5 గంటలకే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి, తలుపు తట్టారు.

ఆత్మీయంగా, భరత్ చంద్ర చారీ.. అంటూ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి విద్యార్థిని పిలుచుకుంటూ, తెల్లవారుజామున ఆ విద్యార్థి ఇంటికెళ్లి నిద్రలేపారు.

ఆ కుటుంబం ఊహించని అతిథి వారింటి తలుపు తట్టడంతో.. ఆ అతిథిని చూసి ఇంటిల్లిపాది ఆశ్చర్యపోయారు.

నేను జిల్లా కలెక్టర్ ని వచ్చాను, ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థి, తల్లిదండ్రులతో ముచ్చటించారు.

కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నామంటూ కుటుంబ సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురై, ఆనందం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక పరిస్థితిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ ఇబ్బందులను, ఆర్ధిక పరిస్థితులను గమనించి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

విద్యార్థికి తన సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఫిబ్రవరి నెల 5000 రూపాయలు ఆ విద్యార్థి కి కలెక్టర్ హనుమంతరావు అందించారు.

విద్యార్థికి చదవడానికి ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

10వ తరగతి ప్రతీ విద్యార్థికి మైలురాయి అంటూ కలెక్టర్ హనుమంతరావు వివరించారు.

సర్ మాటలతో ఆత్మ విశ్వాసం పెరిగింది :

సర్ మాటలతో ఆత్మ విశ్వాసం పెరిగిందని బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవుతానని విద్యార్థి భరత్ చంద్రచారి ధీమాగా చెప్పాడు.