# Tags
#తెలంగాణ

డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,  శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు 

మంథని :

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం అని చాటి చెప్పిన భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

ఆదివారం  డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ 113 జయంతి సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ అని అన్నారు.ఆయన ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలన్నారు. అంబేదర్‌ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, త్యాగాలను మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు.