# Tags
#జగిత్యాల #తెలంగాణ

ఘనంగా ప్రారంభమైన భీమన్న జాతర ఉత్సవాలు

రాయికల్ :   S . Shyamsunder

రాయికల్ పట్టణకేంద్రంలో ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరిగే శ్రీ భీమేశ్వరస్వామి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి .

ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో అందంగా అలంకరించారు.ఉత్సవాలల్లో బాగంగా మొదటి రోజు బుధవారం స్వామివారి కళ్యాణం, రెండవ రోజు గురువారం స్వామి వారి దైవ దర్శనం, అన్న దానం,చివరి రోజు శుక్రవారం స్వామి వారి రథోత్సవం జరుగనుందని ఆలయ ఉత్సవ  నిర్వాహకులు కూనారపు భూమేష్, దేవుని చిన్నరాజం, దేవుని నర్సయ్య వెల్లడించారు.

చివరి రోజు శుక్రవారం స్వామి వారి రథోత్సవంకు మండల ప్రజలతో పాటు మల్లాపూర్, మేడిపల్లి, కోరుట్ల మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. జాతర సందర్భంగా సాoస్కృతిక  కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.