# Tags
#తెలంగాణ

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):-
నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ (సబెర బేగం-షేక్ గౌస్)ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.. అట్లాగే చైర్మన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ ఇట్టి బాధ్యతను నాకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కేకే మహేందర్ కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి బీసీ సంక్షేమ శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు .
రైతుల వరి కోతల దృష్ట్యా వడ్లు మార్కెట్ యాడ్లకు వస్తున్న క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొదట చార్జ్ తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరిస్థను అని చెప్పడం జరిగింది.అట్లాగే ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది..

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…