# Tags

అంగన్వాడీలో చిన్నారికి జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder

మండలంలోని వడ్డెరకాలనీ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం ప్రీస్కూల్ విద్యార్థి విశ్వక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

అంగన్వాడీ టీచర్ బియ్యని సుజాత చిన్నారితో కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….రెండు సంవత్సరాల 6 నెలల పిల్లలనుండి ఆరు సంవత్సరాల వయస్సు వరకు గల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. వారికి సంబంధించిన అక్షరాభ్యాసం,అన్నప్రాసన, జన్మదిన వేడుకలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించుకుంటూ పిల్లలకు ఆటపాటలతో విద్యనందిస్తూ పిల్లల మెదడు పెరుగుదలకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి అందించే సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.