# Tags

జగిత్యాల మీడియాకు చేదు అనుభవం-ప్రేక్షకపాత్రలో మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు

జగిత్యాల :

అందరూ వెళ్లిపోండి! డీపీఆర్వో సమాచారం ఇస్తాడు : మంత్రి సూచనలతో మీడియాను వెళ్ళిపోమన్న కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రానికి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాక కోసం కలెక్టరేట్ లో ఉదయం ఆయన టూర్ షెడ్యూల్ ప్రకారం కవరేజ్ కోసం ఎదురుచూస్తున్న మీడియా బృందంకు చేదు అనుభవం ఎదురైంది.

ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం విప్ లక్ష్మణ్ కుమార్ లతో కలిసి చేరుకున్నారు.

ఆ క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ రాకపై… ‘మీడియా మిత్రులకు మనవి కలెక్టరేట్ మీటింగ్ హాల్ కి రాగలరని విజ్ఞప్తి’ అంటూ డీపీఆర్వో వాట్సప్ ద్వారా ఇచ్చిన సూచనల మేరకు జగిత్యాల మీడియా బృందం కలెక్టరేట్ మీటింగ్ హాల్ కు వెళ్ళింది.

జిల్లాలో వైద్య సేవల బలోపేతం పై సమీక్ష ను ప్రారంభించారు. కానీ ఆమాత్యులు (mantri) ఏమనుకున్నారో ఏమో…ఆయన సూచనల మేరకు వెంటనే కలెక్టర్ మీటింగ్ హాల్ లో మీడియాను చూసి అందరూ వెళ్లిపోండి! డీపీఆర్వో సమాచారం ఇస్తాడు అంటూ మంత్రి సాక్షిగా మీడియాను కలెక్టర్ వెళ్ళిపోమన్నారు.

దీంతో ఏమి చేయాలో అర్థంకాక మీడియా బయటకు వెళ్ళిపోయింది.

ఆ సమయంలో మంత్రి రాజనర్సింహాతోపాటుగా, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే లు డా సంజయ్ కుమార్, డా.సంజయ్ ప్రేక్షకపాత్ర వహించారు.

అయితే, కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులకు మించి మీడియా బృందం ఉండడంతో సమీక్షకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతోనే, మంత్రి సూచనలు మేరకు కలెక్టర్, మీడియాను మరియు వారితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా బయటకు పంపినట్టు అధికారులంటున్నారు.