# Tags
#తెలంగాణ

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా.
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇటీవల గణపతి నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించిన బిజెవైఎం కార్యకర్త న్యాలకొండ రాకేష్ (18) కుటుంబానికి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ కార్యకర్త మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని విచారం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబ పరిస్థితులను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ కి తెలియజేసి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చెట్కూరి సత్తయ్య గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం మండల కార్యదర్శి అరవింద్ బీజేవైఎం నాయకులు గుర్రం సాయిరాం, చౌకి నరేష్, సోమరపు ప్రశాంత్, నిమ్మల సాయి, కోడూరి నితిన్, మున్నా, సిద్దు, సాయి పవన్, మరియు రెడ్డి సంఘం ప్రతినిధులు గుల్లపల్లి సత్యనారాయణ రెడ్డి, చల్ల దేవ రెడ్డి, జంగా సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.