# Tags

వరదవెల్లిలో బోట్ సేవలు అందుబాటులోకి..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్

వేములవాడ :(తెలంగాణ రిపోర్టర్ )

బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు బోట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బోయినిపల్లి మండలం వరదవెల్లి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బోట్ సేవలను ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ తోపాటు స్వయంగా బోట్ లో వెళ్లి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోట్ సేవలు అందుబాటులోకి రావడంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. అందరూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడంతోపాటు ప్రతి ఒక్కరూ స్వామి ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు.