# Tags
#తెలంగాణ

#BreakingNews భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కన్నుమూత..

ఢిల్లీ :

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు., ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు.

కర్ణాటక బెళగావి నుంచి ఢిల్లీకి పయనమైన ఖర్గే, రాహుల్‌ గాంధీ..

ఎయిమ్స్‌కు సోనియా గాంధీ..

92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ఈరోజు (గురువారం) రాత్రి తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు.

1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్‌ సింగ్‌..

2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్‌..

దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్‌ ఒకరు..

1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు..

ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన గొప్ప వ్యక్తిగా మన్మోహన్‌కు పేరు..

1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు..

ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్‌ సింగ్‌