# Tags

ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు తప్పనిసరి :ఎస్ ఐ బోయిని సౌజన్య


బెజ్జంకి :

మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్ ఐ బోయిని సౌజన్య గ్రామంలోని పోచమ్మ దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు.

ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించుకోవాలని కిరాణా షాపులలో ప్రధాన కూడలిలో ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఒక సీసీ కెమెరా వందమంది తో సమానంగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు గ్రామస్తులు పాల్గొన్నారు.