# Tags
#తెలంగాణ

నేరాల నియంత్రణకు,స్వీయ రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి:వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ..

శనివారం రోజున వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్లో పట్టణ పరిధిలోని హాస్పిటల్స్ యాజమాన్యంతో వేములవాడ పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హజారై సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగలపై అవగాహన కల్పించిన ఏఎస్పీ .

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ
సీసీ కెమెరాలు ఉండటం వలన నేరస్తులు నేరం చేయడానికి ఒకటికి రెండు సార్లు అలోచిస్తారని, సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామలలో ,పట్టణలలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని, గ్రామలలో, పట్టణలలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.

వేములవాడ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుగకు వచ్చిన హాస్పిటల్స్ యాజమాన్యనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఏఎస్పీ.ఏఎస్పీ వెంట టౌన్ సి.ఐ వీరప్రసాద్,హాస్పిటల్స్ యాజమాన్యం ఉన్నారు.