# Tags
#People #జగిత్యాల

ఘనంగా జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలు


రాయికల్ : S. Shyamsunder

పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ప్రముఖ జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం తాజా మాజీ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ…
రాయికల్ మండలం నుండి మొట్ట మొదట సారిగా వెండి తెరపై వార్తల వ్యాఖ్యాత గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన తెలంగాణా ఆవిర్భావ అభివృద్ధి సమయంలో కూడ సేవలందించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గంగాధర్ సత్తమ్మ, డాక్టర్ మోర సుమన్ రోజా,వైద్యులు శ్రీలత మోర రాం మూర్తి , ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడకుంట్లా జగదీశ్వర్, ట్రూత్ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టు నాగమల్ల శ్రీకర్, సింగని శ్యాంసుందర్, గంగాధర సురేష్, సయ్యద్ రసూల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.