# Tags
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న రథం…

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డి పేట్:
కార్తిక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు మేగి నరసయ్య, గడ్డం కిషన్, రేసు శంకర్, గడ్డం కరుణాకర్, ఈసారి కిరణ్, రేస్ మనోజ్, కొత్త అరుణ్,పుల్లయ్యగారి తిరుపతి, అల్లం శ్రీకర్ తదితరులు కలిసి రథంను బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్వామి వారి బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకోవాలని కోరారు.