# Tags

వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ జగిత్యాల

జగిత్యాల :

సర్వైకల్ క్యాన్సర్ నివారణను వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు.

జగిత్యాల ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు.

హెచ్ పి వి వ్యాక్సిన్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పేర్కొన్నారు.

దేశంలో క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్న సందర్భంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, దాని ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యపడుతుందని గైనకాలజీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి శ్రీలత పేర్కొన్నారు.

9 సంవత్సరాలు నిండిన నుండి 45 సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపారు.


జగిత్యాల ఐఎంఏ హాల్ లో ప్రతినెల రెండవ శనివారం రోజున సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ను అందించే విధంగా చర్యలు చేపట్టామని జగిత్యాల ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి కోరారు.

ఈ వ్యాక్సినేషన్ లో 59 మంది బాలికలు, మహిళలు వ్యాక్సినేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ ఎం ఏ కోశాధికారి కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వోడ్నాల రజిత, డాక్టర్ స్వరూప, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.