# Tags
#తెలంగాణ

రాయికల్ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

రాయికల్: S. Shyamsunder :

చత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల పిలుపుమేరకు బుధవారం సాయంత్రం శివాజీ బొమ్మ నుండి, పాత బస్టాండ్ మీదుగా గాంధీ బొమ్మ, వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…..
హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు.

ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు.హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషిచేసిన, పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎనుగందుల రమేష్,తురుగ శ్రీధర్ రెడ్డి,లింగ శ్రీనివాస్, మ్యాకల రమేష్, కొయ్యడి మహిపాల్ రెడ్డి,కుర్మ మల్లారెడ్డి ,సామల్ల సతీష్, దాసరి గంగాధర్,
బోడుగం శ్రీకాంత్ రెడ్డి,తీగుళ్ల గోపాల్ రెడ్డి,బన్న సంజీవ్, కునారపు భూమేష్ ,మచ్చ శేఖర్, సుమన్, రాంరెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు.