# Tags
#world #Events #Tech #తెలంగాణ

సింగపూర్ లో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో “మీట్ అండ్ గ్రీట్”-పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిణ్ రెడ్డి ఉన్నారు.

సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, సొసైటీ కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.