# Tags

భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు.

భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి (National Defence Fund) కి విరాళంగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

“మన దేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అందిస్తున్న అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా నేను నా ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధి (#nationaldefencefund) కి విరాళంగా అందిస్తున్నానని వెల్లడించారు.

ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని నా సహచరులు, పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాను….మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం.

విజయం మన సొంతం!

జై హింద్!”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

In a heartfelt gesture of support for the Indian Armed Forces, who courageously risk their lives to safeguard the nation’s borders and combat terrorism, Telangana Chief Minister Shri Anumula Revanth Reddy has announced the donation of his one month’s salary to the National Defence Fund (#NationalDefenceFund).

“As an Indian first, I have decided to make a very modest contribution of one month’s salary to the #NationalDefenceFund for the efforts of our country’s brave Armed Forces to wipe out terrorism, and safeguard our borders & people. I have requested all my colleagues and party peers, as well as well meaning citizens to join in this drive. Let us all stand together, as one, with our forces till our most decisive moment of triumph. Jai Hind!”the Chief Minister stated.

OperationSindooor #indianarmy #Telangana