# Tags
#politics #తెలంగాణ

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్

రాయికల్ : S. Shyamsunder

చారిత్రాత్మక నిర్ణయం…మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ ఆమోదం కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ అన్నారు.

బుధవారం రాయికల్ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాల, క్షీరాభిషేకం తోపాటు పూలమాల వేసి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.రిజర్వేషన్ల పెంపుకు రాజ్యాంగ సవరణ చేయించేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.తమిళనాడు లో రిజర్వేషన్లను రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చినట్లు తెలంగాణ బీసీ రిజర్వేషన్లను కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.పార్లమెంట్ లో ఆమోదం పొంది చట్టసభలు,విద్య,ఉద్యోగ రంగాల్లోని 42 శాతం అవకాశాలు దక్కితే హర్షిస్తామని పేర్కొన్నారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిసి బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమనీ,తెలంగాణ బిసి బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,మాజీ సర్పంచ్ ఎద్దండి భూమరెడ్డి,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,నాయకులు కొయ్యేడి మహిపాల్, బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,ఏద్దండి దివాకర్,తలారి రాజేష్,పొన్నం శ్రీకాంత్,షాకీర్, మసూద్,మురళి,మోబిన్,రామ్ రెడ్డి,గోపాల్,భూమా గౌడ్,బత్తిని నాగరాజ్,రాజేష్,బాపురపు రాజీవ్,గుమ్మడి సంతోష్,సాయికుమార్,అశోక్,తదితరులు పాల్గొన్నారు.