# Tags
#తెలంగాణ

వేములవాడలో ఈనెల 20 వ తేదిన ముఖ్యమంత్రి పర్యటన : ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొన్నం ప్రభాకర్

(తెలంగాణ రిపోర్టర్):
వేములవాడ లో ఈ నెల 20 వ తేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌజ్ ,శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్ లో విద్యుత్ ఇబ్బందులు అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాల పై పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక బద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు..
ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవో అధికారులకు ఆదేశించారు సమయం తక్కువ ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆలయంలో సూచనలు చేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ,ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో ఇతర అధికారులు ఉన్నారు..