#తెలంగాణ

చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో నేలకొరిగిన భారీవృక్షం

కరీంనగర్ : (ముడికె కనకయ్య):

చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ కు వెళ్లే రహదారిపై భారీవృక్షం నేలకొరిగింది.

గత రెండు రోజుల క్రితం వర్షాలకి బాగా నాని రోడ్డుపైన పడిపోయినది. సంఘటన స్థానంలో ఈ రహదారి పై వాహనదారులు ఎవరు రాకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

భారీ వృక్షం రోడ్ పై పడిపోవడంతో హుస్నాబాద్ కరీంనగర్ నుండి వచ్చే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా మారింది. అధికారులు వచ్చి క్లియర్ చేయాల్సి ఉన్నది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *