# Tags
#తెలంగాణ

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ panja): రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజన్న ఆలయం ముందు ఘనంగా నిర్వహించారు..ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో 55 కోడెలను కట్టేసి కోడె మొక్కలు చెల్లించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం కేక్ కట్ చేశారు.